Anantapur: ఈ నెల 26న రుక్మిణి పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు!

Anantapur: అనంతపురంలో ఈ నెల 26న జరగనున్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆషాఢ బ్రహ్మోత్సవాల్లో మరాఠీ అభంగాలు పాడాల్సిందిగా పామిడి భజన మండలికి ఆహ్వానం అందింది.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 13 July 2026 12:15 AM IST
Anantapur
X

Anantapur: ఈ నెల 26న రుక్మిణి పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు!

అనంతపురం: పట్టణంలో ఈ నెల 26వ తేది ఆదివారం జరుగనున్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆషాడ మాస బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మరాఠి అభంగాలు ఆలపించాలని *పామిడి భావసారా క్షత్రియ భజన మండలి*ని అనంతపురం పట్టణ భావసారా క్షత్రియ సమాజ్ వారు ఆహ్వానించారు.

శనివారం అనంతపురం నుంచి వచ్చిన సమాజ్ సభ్యులు పామిడికి విచ్చేసి భజన మండలి సభ్యులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

జ్ఞానదేవుడు, తుకారాం, నామదేవుడు రచించిన అభంగాలు పాడడంలో పామిడి భజన మండలి సభ్యులు ప్రావీణ్యం కలిగి ఉన్నారని, వారి కీర్తనలతో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభ చేకూరుతుందని సమాజ్ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు ఆహ్వానాన్ని స్వీకరించి 26న బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటామని తెలిపారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story