Kalyandurgam: నిబంధనలు మీరితే చర్యలు తప్పవు: కళ్యాణదుర్గం సీఐ హెచ్చరిక!

Kalyandurgam: కళ్యాణదుర్గం రూరల్ పరిధిలోని బోరంపల్లి, గోళ్ల తదితర గ్రామాల్లోని వినాయక మండపాలను రూరల్ సీఐ సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 14 Sept 2026 10:10 PM IST
Kalyandurgam
X

Kalyandurgam: నిబంధనలు మీరితే చర్యలు తప్పవు: కళ్యాణదుర్గం సీఐ హెచ్చరిక!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రూరల్ సీఐ సుడిగాలి పర్యటన నిర్వహించారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపల్లి, సీబాయి, గోళ్ల, ఓబుళాపురం, మానిరేవు, నూసికొట్టాల, నూసికొట్టాల తండా, బాలవెంకటపురం, పింజిరికొట్టాల, కడదరకుంట, బట్టువానిపల్లి, పాల్వాయి గ్రామాల్లోని వినాయక మండపాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులతో మాట్లాడిన సీఐ.. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, అవాంఛనీయ సంఘటనలకు దారితీసే చర్యలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున తగిన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam