Anantapur: రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేటలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం ప్రారంభమైంది.
Anantapur: రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ వెంకట రాముడు గారు హాజరు కావడం జరిగినది.
వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరపున ఖరీఫ్ కు సిద్ధం అవుతున్న రైతుల కోసం రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం చేసిందని రైతులు ఎల్ని నో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉంటుందని అందు కొరకు తక్కువ కాల వ్యవధి పంటలు సాగు చేయాలని, కౌలు రైతులు తప్పనిసరిగా CCRC కార్డులు పొందాలని,
రైతులు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా యూరియా మరియు DAP ఎరువుల సరఫరా అవుతాయి అని, ఈ పంట యాప్ ద్వారా రైతులు సాగు చేసే పంటలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, గ్రామ వ్యవసాయ అధికారి లలిత మరియు కొత్తపేట గ్రామ రైతులు పాల్గొన్నారు.




