Rayadurgam: సరస్వతి విద్యా మందిరంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Rayadurgam: స్థానిక సరస్వతి విద్యా మందిరంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో అధికారులకు రాఖీలు కట్టారు.
Rayadurgam: సరస్వతి విద్యా మందిరంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
రాయదుర్గం: రాఖీ పౌర్ణమి సందర్భంగా స్థానిక సరస్వతి విద్యా మందిరంలో పాఠశాల అధ్యక్షులు పోరాళ్ళు ధనార్జునా ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మరియు కార్యదర్శి సోమ నీలకంఠ మాట్లాడుతూ పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగిందని ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఇబ్బందుల్లో పడ్డాడని అప్పుడు దేవేంద్రుని భార్య శశిదేవి తన భర్త క్షేమం కోసం శ్రీ మహావిష్ణువు ప్రార్థించి శ్రీ మహా విష్ణు అనుగ్రహంతో శశిదేవి ఒక దారాన్ని తీసుకొని దేవేంద్రుడి చేతికి కట్టి ధైర్యం చెప్పి యుద్ధములో విజయం సాధిస్తావని రక్షాబంధనం కట్టి పంపింది.
ఆ ధైర్యంతో విజయం సాధించడం జరిగింది అప్పటినుంచి అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతి కాగా రాఖీ కట్టే సంప్రదాయం ఏర్పడిందని రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరుడికి చేతికి రాఖీ కట్టి అతనికి సుఖసంతోషాలను కోరుకుంటుందని సోదరుడు తన సోదరిని ఎల్లప్పుడూ ప్రేమగా గౌరవంగా చూసుకుంటానని వాగ్దానం చేస్తాdu అని విద్యార్థిని విద్యార్థులకు రాఖీ పౌర్ణమి గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
తదుపరి ప్రభుత్వ కార్యాలయంలోనూ పోలీస్ స్టేషన్ లోనూ వ్యాపారస్తులకు విద్యార్థిని విద్యార్థుల ద్వారా రాఖీ కట్టించి నీవు నాకు రక్ష నేను నీకు రక్ష అని పట్టణంలో విద్యార్థుల ద్వారా రాఖీ కట్టించడం జరిగిందిమనము కూడా ఆలా మెలగాలని తెలియజేయడమైనది ఈ కార్యక్రమం నందు తిరుమల రాయుడు ప్రధానాచార్యులు రాజేశ్వరి kanche రిపోర్టru హనుమంతుమహాదేవి ఆచార్యులు అనసూయ శిల్ప వందన జయశ్రీ తదితర ఆచార బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




