Kadiri: తలుపుల మండలంలో కాంగ్రెస్ ZPTC ప్రచారం ఘనంగా నిర్వహణ!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో 16 ఏళ్ల తర్వాత ZPTC ఎన్నికల బరిలోకి కాంగ్రెస్. షంషాద్ బేగం తరుపున ప్రచారం నిర్వహించిన తులసిరెడ్డి, షానవాజ్.
Kadiri: తలుపుల మండలంలో కాంగ్రెస్ ZPTC ప్రచారం ఘనంగా నిర్వహణ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షంషాద్ బేగం తరుపున ZPTC ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు N. తులసిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు K.S. షానవాజ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ సామియుల్లా, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో దాదాపు 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దాదాపు 16 సంవత్సరాల తర్వాత తలుపుల మండలంలో ZPTC ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాల్గొంటుండటం విశేషంగా మారింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తలుపుల మండలంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ జెండాలు కనిపించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




