Kadiri: మహిళల రక్షణకు 'శక్తి యాప్' కవచం.. సత్యసాయి జిల్లా పోలీసులు
Kadiri: సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మైలేపల్లి గ్రామంలో శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించింది.
Kadiri: మహిళల రక్షణకు 'శక్తి యాప్' కవచం.. సత్యసాయి జిల్లా పోలీసులు
Kadiri: పుట్టపర్తి, కదిరి సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలేపల్లి గ్రామంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శక్తి యాప్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, బాలికలు వెంటనే సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో తెలియజేశారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లోన్ యాప్స్ మోసాలు, బ్యాంకు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో చట్టం (POCSO Act), మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన చర్యల గురించి అవగాహన కల్పించారు. చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి వివరించి, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పెద్దలకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా అత్యవసర సహాయ నంబర్లు 100/112, మహిళల హెల్ప్‌లైన్ 181, అగ్నిమాపక సేవల కోసం 101, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930, బాలల సహాయ నంబర్ 1098 గురించి ప్రజలకు వివరించారు. కోడిపందేలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
గ్రామ ప్రజలు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని శక్తి టీం సూచనలను శ్రద్ధగా విన్నారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంక్షేమం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం సభ్యులు తెలిపారు. పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం.




