Pamidi: మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి, గుత్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమ్మె ఉధృతమైంది.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 10 May 2026 10:40 AM IST
Pamidi
X

Pamidi: మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన!

పామిడి: అనంతపురం జిల్లా పామిడి,గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి తాగునీటి పంపు హౌస్ వద్ద తాగునీటి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరింది. ముందుగా కార్మికులు పంపు హౌస్ ఎదుట మోకాళ్లపై నిలుచుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు .జేఏసీ నాయకులు గిరిబాబు, చంద్ర, శ్రీనివాసులు భాష మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వలేదని, దీంతో వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పథకం నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ప్రభుత్వానికి సత్యసాయి నీటి పథకాన్ని నిర్వహించే ఉద్దేశం లేదని ఆరోపించారు. ఈ విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు.అధికారులు స్పందించి వర్కర్లకు రావాల్సిన జీతాలను అందించి సమస్య పరిష్కరించాలన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story