Dharmavaram: ఉత్తమ జర్నలిస్ట్‌గా శ్రీ వైష్ణవ శ్రీనివాసులుకు స్వర్ణ నంది అవార్డు!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వైష్ణవ శ్రీనివాసులు హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఉత్తమ జర్నలిస్ట్‌గా స్వర్ణ నంది అవార్డును అందుకున్నారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 28 Sept 2026 8:05 AM IST
Dharmavaram
X

Dharmavaram: ఉత్తమ జర్నలిస్ట్‌గా శ్రీ వైష్ణవ శ్రీనివాసులుకు స్వర్ణ నంది అవార్డు!

Dharmavaram: తెలంగాణ లోని హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ధర్మవరం కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వైష్ణవ శ్రీనివాసులు ఉత్తమ జర్నలిస్ట్‌గా స్వర్ణ నంది అవార్డును అందుకున్నారు.జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డుతో పాటు ఘనంగా సన్మానించారు.

సమాజంలో ప్రతిభావంతులైన వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను,కలలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ,మరింతగా ఉత్తేజపరిచేందుకు మెగా హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్,నటి శిరీష రెడ్డి,సినీ నటుడు గౌతమ్ రాజు,డైరెక్టర్ వేణు కరుణాకర్,హీరోయిన్ జోత్స్నా,రిటైర్డ్ ఎస్పీ రత్న చేతుల మీదుగా శ్రీ వైష్ణవ శ్రీనివాసులకు స్వర్ణ నంది అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు.

శాలువా కప్పి,మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు.జర్నలిస్టుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజానికి ఉపయోగపడే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించడం పట్ల శ్రీ వైష్ణవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తూ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు.

ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని,భవిష్యత్‌లోనూ ప్రజా సమస్యలపై మరింత నిబద్ధతతో పనిచేస్తూ,నిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని శ్రీ వైష్ణవ శ్రీనివాసులు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు,ప్రముఖులు,స్నేహితులు,శ్రేయోభిలాషులు ఆయనను ఘనంగా అభినందించారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM