O.D. Cheruvu: ఓ.డి.చెరువులో మురుగు కంపు: రహదారిపై ప్రవహిస్తున్న వ్యర్థాలు!

O.D. Cheruvu: ఓ.డి.చెరువు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపైకి వదులుతున్న మురికినీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 29 May 2026 11:03 AM IST
O.D. Cheruvu
X

O.D. Cheruvu: ఓ.డి.చెరువులో మురుగు కంపు: రహదారిపై ప్రవహిస్తున్న వ్యర్థాలు!

O.D. Cheruvu: ఓ.డి.చెరువు మండల కేంద్రంలోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారిపై మురికినీరు ప్రవహిస్తున్నాడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు, హోటల్లు, వ్యాపార సముదాయాల నుండి చెత్త, మురికినీటిని నేరుగా ప్రధాన రహదారిపైకి వదులుతుండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పాదచారులు, వాహనదారులు, చుట్టుపక్కల నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

రోడ్డుపై ఎప్పటికప్పుడు మురికినీరు నిల్వ ఉండటంతో దోమలు అధికంగా వ్యాపించి, విషజ్వరాలు, ఇతర అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో పోలీస్ అధికారులు సంబంధిత వ్యక్తులను పిలిపించి, రహదారిపైకి చెత్త, మురికినీరు వదలవద్దని పలుమార్లు హెచ్చరించినప్పటికీ, కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ హెచ్చరికలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత గ్రామపంచాయతీ అధికార యంత్రాంగం స్పందించి, మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story