Rayadurgam: భవన స్కూల్ బస్సు నిర్లక్ష్యం: పిల్లల ప్రాణాలతో ఆటలా?
Rayadurgam: రాయదుర్గం భవన ఈ.ఎం. స్కూల్ బస్సుకు వెనుక అద్దాలు లేకుండానే విద్యార్థుల రవాణా. ఆర్‌టీఓ (RTO) తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్.
Rayadurgam: భవన స్కూల్ బస్సు నిర్లక్ష్యం: పిల్లల ప్రాణాలతో ఆటలా?
Rayadurgam: రాయదుర్గం పట్టణంలోని భవన E.M. స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని భారత విద్యార్థి ఫెడరేషన్ - SFI ఆరోపించింది.
నేడు రాయదుర్గం పట్టణంలో భవన స్కూల్‌కు చెందిన బస్సు నెం.2 బస్సు AP 04 3W 6851
వెనుకవైపు అద్దాలు పూర్తిగా లేకుండా విద్యార్థులను తరలిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
ప్రమాదాలకు ఆహ్వానం
చిన్నపిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సుకు వెనుకవైపు అద్దాలు లేకపోవడంతో ఏ క్షణంలోనైనా పిల్లలు కింద పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదం జరిగితే తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. వేసవి కాలంలో దుమ్ము, వేడి గాలికి పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
"రేపు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యానిదే" అని SFI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
RTO గారు తక్షణం స్పందించాలి
మోటార్ వాహనాల చట్టం ప్రకారం స్కూల్ బస్సులకు అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ భవన స్కూల్ యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలి, లాభాల కోసం పిల్లల ప్రాణాలను పణంగా పెడుతోంది.
కావున RTO గారు వెంటనే స్పందించి,
1. నిబంధనలు ఉల్లంఘించిన భవన స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసి ఫిట్‌నెస్ రద్దు చేయాలి
2. స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
3. రాయదుర్గం పరిధిలోని అన్ని స్కూల్ బస్సులను తనిఖీ చేయాలి
అని SFI డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించకుంటే, రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని SFI హెచ్చరించింది.
"పిల్లల భద్రతతో రాజీపడేది లేదు" అని SFI స్పష్టం చేసింది.




