Kadiri: బైండోవర్ ఉల్లంఘన: నిందితుడికి 65 రోజుల రిమాండ్!
Kadiri: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి హత్యకు పాల్పడిన నిందితుడు షేక్ వలీ భాషకు కదిరి కోర్టు 65 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Kadiri: బైండోవర్ ఉల్లంఘన: నిందితుడికి 65 రోజుల రిమాండ్!
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బైండోవర్‌లో ఉన్న ఓ నిందితుడికీ కదిరి కోర్ట్ 65రోజుల పాటు రిమాండ్ విధించడం జిల్లాలో మొట్టమొదటి సారిగా చోటు చేసుకుంది.
అటెంప్ట్ మర్డర్ కేసులో బైండోవర్‌లో ఉన్న షేక్ వలీ భాష... బైండోవర్ గడువు పూర్తికాకముందే అడపాల వీధికి చెందిన రమేష్‌ను హత్య చేసిన కేసులో కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అరెస్టుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి, బైండోవర్‌లో ఉన్నప్పటికీ చట్టాన్ని ధిక్కరించి మరోసారి నేరానికి పాల్పడిన వలీ భాషపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు నిబంధనలు పాటిస్తూ సత్ప్రవర్తనతో ఉండాలని, మరోసారి నేరాలకు పాల్పడితే చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ హెచ్చరించారు. నేరస్తులకు ఎలాంటి ఉపశమనం ఉండదని, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.




