Nallacheruvu: మద్దేపల్లి గంగమ్మ ఆలయానికి సిమ్స్ ఎండీ నిసార్ ఆర్థిక సాయం!
Nallacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం మద్దేపల్లి గంగమ్మ గుడి పెయింటింగ్ పనులకు కదిరి సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్ యాసిన్ ఖాన్ రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.
Nallacheruvu: మద్దేపల్లి గంగమ్మ ఆలయానికి సిమ్స్ ఎండీ నిసార్ ఆర్థిక సాయం!
నల్లచెరువు: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని ఓరువాయి గ్రామం మద్దేపల్లిలో ఉన్న గంగమ్మ గుడి పెయింటింగ్ పనుల కోసం కదిరి సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ రూ.10,000 ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు సహకారంగా నిసార్ యాసిన్ ఖాన్ ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.
గ్రామ దేవత ఆలయ అభివృద్ధికి సహకారం అందించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి, నిసార్ యాసిన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లోని ఆలయాలు, సామాజిక అవసరాలకు తన వంతు సహకారం అందించడం ద్వారా నిసార్ యాసిన్ ఖాన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.
Next Story




