Guntakal: ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి కోసం కన్నతల్లినే చంపిన కుమారుడు!
Guntakal: ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి కోసం కన్నతల్లి సుంకలమ్మను హత్య చేసిన కుమారుడు ఆకుతోట ఆదెప్పను గుంతకల్లు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Guntakal: ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి కోసం కన్నతల్లినే చంపిన కుమారుడు!
గుంతకల్లు: ఇన్సూరెన్స్ బీమా డబ్బులు, తల్లి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రాయించుకోవాలనే ఆశతో కన్నతల్లినే హత్య చేసిన ఘటన గుంతకల్లులో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన కుమారుడిని గుంతకల్లు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు పట్టణంలోని వాల్మీకి సర్కిల్, దోనిముక్కల రోడ్డుకు చెందిన ఆకుతోట సుంకలమ్మ అనే వృద్ధురాలిని ఆమె కుమారుడు ఆకుతోట ఆదెప్ప (55) కొంతకాలంగా ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటిని తన పేరుపై రాయాలని వేధిస్తున్నట్లు పోలీసుల ప్రెస్నోట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వచ్చి తల్లిని కొడుతూ, చంపేస్తానని బెదిరించేవాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 16వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో గొంతు బిగించి తల్లి సుంకలమ్మను హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి పెద్ద కుమార్తె చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 110/2026, సెక్షన్ 103(1) BNS కింద కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలు, గుంతకల్లు డీఎస్పీ ఉత్తర్వుల మేరకు రూరల్ సీఐ ఎం. రామారావు, ఎస్ఐ కె. బాలముని, పోలీసు సిబ్బంది నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్, ఆలూరు రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నిందితుడు ఆదెప్పను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం గుంతకల్లు జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.




