Kasapuram: సాపురంలో ఆధ్యాత్మిక శోభ.. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు
Kasapuram: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Kasapuram: సాపురంలో ఆధ్యాత్మిక శోభ.. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు
కసాపురం: హనుమజ్జయంతి మహోత్సవములు10.05.2026 ఆదివారము వైశాఖ బహుళ అష్టమి ఉదయం 8-05 నిమిషాల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన , గోపూజ, సుందరకాండ మన్యుసూక్త పారాయణ హోమము , శ్రీరామ ఆంజనేయ మూల మంత్ర అనుష్టానం మరియు సాయంత్రం 5-00 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి లక్ష తమలపాకులు అర్చన కార్యక్రమము నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె.సుగుణమ్మ గారు , ప్రధాన ఆర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు , వేద పండితులు , అర్చకులు , భక్తులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story




