Puttaparthi: పుట్టపర్తిలో బైక్ స్టంట్లు చేసిన యువకుల అరెస్ట్
Puttaparthi: పుట్టపర్తి బైపాస్ రోడ్డుపై బైక్ స్టంట్లు చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, సీఐ యువరాజు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
Puttaparthi: పుట్టపర్తిలో బైక్ స్టంట్లు చేసిన యువకుల అరెస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా:
పుట్టపర్తి సమీపంలో బైక్ లతో ప్రమాదకర స్టంట్స్ నిర్వహించిన ముగ్గురు యువకులు.
పుట్టపర్తి పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ నిర్వహించి ప్రజలను భయాందోళనకు గురి చేసిన ముగ్గురి యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించిన పోలీసులు.
తల్లిదండ్రుల ఆధ్వర్యంలో బైక్ స్టంట్స్ చేసిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పుట్టపర్తి అర్బన్ సీఐ యువరాజు.
యువకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.
రోడ్లపై స్టంట్స్, వీలింగు రేసింగులకు పాల్పడితే కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఐ యువరాజ్.
సోషల్ మీడియాలో గుర్తింపు లేదా వినోదం కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేయడం అత్యంత బాధ్యతరాహిత్యమన్న సిఐ.
ఇటువంటి చర్యల వల్ల స్టంట్స్ చేసే యువకులతో పాటు ఇతర వాహనధారులు, పాదచారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించిన సీఐ.




