Kadiri: కదిరి ఎమ్మెల్యే కందికుంటకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళలు!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు బ్రహ్మకుమారీలు, మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Kadiri: కదిరి ఎమ్మెల్యే కందికుంటకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళలు!
Kadiri: సత్య సాయి జిల్లా కదిరిలో రాఖీ పండుగ సందర్భంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కార్యాలయంలో బ్రహ్మకుమారిలు, మహిళలు ఎమ్మెల్యేని కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి, ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తనపై ఆప్యాయతతో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారిలు, మహిళలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి అక్కాచెల్లెమ్మ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, వారి కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఆనందం వెల్లివిరియాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.




