Guntakal: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న కలెక్టర్!
Guntakal: కసాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Guntakal: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న కలెక్టర్!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఏ. శ్యామ్ ప్రసాద్, IAS తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు, ప్రధాన అర్చకులు శ్రీ కే. రాఘవాచార్యులు, వేద పండితులు, అర్చకులు కలెక్టర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం యాగశాలలో వేద పండితులచే వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలను కలెక్టర్‌కు అందజేశారు.




