Puttaparthi: ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోండి కలెక్టర్!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
Puttaparthi: ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోండి కలెక్టర్!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీ యువకులు ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీ యువకులకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇది సువర్ణ అవకాశమని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన యువత తమ ఆధార్ పత్రాలతో సంబంధిత పోలింగ్ బూత్‌ను సందర్శించి ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.




