Dharmavaram: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు జీవనజ్యోతి విద్యార్థి!

Dharmavaram: ధర్మవరం పట్టణం సిద్దయ్యగుట్ట జీవనజ్యోతి ఉన్నత పాఠశాల విద్యార్థి కే. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అండర్-14 ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెడ్‌మిస్ట్రెస్ సిస్టర్ సుజాత తెలిపారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 21 Nov 2026 3:49 PM IST
Dharmavaram
X

Dharmavaram: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు జీవనజ్యోతి విద్యార్థి!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవర: రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ పోటీలకు ధర్మవరం పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల జీవనజ్యోతి ఉన్నత పాఠశాల విద్యార్థి కే. చంద్రశేఖర్ ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్ మిస్ సిస్టర్ సుజాత తెలిపారు.ఈ సందర్భంగా సిస్టర్ సుజాత మాట్లాడుతూ గత నెల 30వ తేదీన అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి అండర్ 14 హాకీ జట్టుకు కే చంద్రశేఖర్ ఎంపికయ్యాడని.

పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థి నవంబర్ నెల 22 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హిందూపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థి ని పాఠశాల హెడ్ మిస్టర్స్ సిస్టర్ సుజాత, ఉపాధ్యాయ బృందం,పి ఈ టి, పిడి, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM