Puttaparthi: కలెక్టర్ బంగ్లాలో శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలు చేసిన కలెక్టర్!

Puttaparthi: పుట్టపర్తిలోని కలెక్టర్ బంగ్లాలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ కుటుంబ సమేతంగా మట్టి గణపతికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 14 Sept 2026 1:34 PM IST
Puttaparthi
X

Puttaparthi: కలెక్టర్ బంగ్లాలో శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలు చేసిన కలెక్టర్!

Puttaparthi: వినాయక చవితి పండగను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ బంగ్లాలో శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణను కాపాడాలనే ఉన్నతాశయంతో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహానికే ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అందించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, అందువల్ల భక్తులందరూ పర్యావరణహితమైన మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు.

సమాజంలో పర్యావరణ స్పృహను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI