Sri Sathya Sai: క్యాంప్ ఆఫీస్ టు కలెక్టరేట్.. ఈ-బైక్‌పై దుమ్ములేపిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆదర్శంగా నిలిచారు.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 18 May 2026 12:26 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: క్యాంప్ ఆఫీస్ టు కలెక్టరేట్.. ఈ-బైక్‌పై దుమ్ములేపిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!

Sri Sathya Sai: ఇంధన పొదుపులో భాగంగా సోమవారం పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి ఎలక్ట్రిక్ వాహనంలో కలెక్టరేట్కు వచ్చి హాజరైన కలెక్టర్. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చర్యలు చేపట్టారు.డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే సందేశంతో ఆయన 'నో వెహికల్ డే' పాటించారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి, ఎలక్ట్రిక్ వాహనాలను లేదా ప్రజా రవాణాను వినియోగించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా ఈ-స్కూటర్‌పై రావడంపై కలెక్టరేట్ సిబ్బంది, ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL