Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా వై. విజయలక్ష్మి ఎంపిక!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని జనసేన 26వ వార్డు కౌన్సిలర్ వై. విజయలక్ష్మికి కూటమి కేటాయించింది. మున్సిపాలిటీని ఉత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు.
Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా వై. విజయలక్ష్మి ఎంపిక!
ధర్మవరం: ధర్మవరం మున్సిపల్ చైర్ పర్సన్ గా జనసేన పార్టీకి సంబంధించి 26 వార్డు కౌన్సిలర్ వై విజయలక్ష్మి కి కూటమి కేటాయించింది.. ఇందుకు సంబంధించి ఆదివారం రాత్రి అధికారికంగా విజయలక్ష్మి పేరు వెల్లడించారు. ఉన్నత చదువులు (BSC, MLT )చదివిన విజయలక్ష్మి ప్రజాసేవపై మక్కువతో భర్త వై.రాజు(EX కౌన్సిలర్) సహకారంతో ఇటీవల కౌన్సిలర్ గా గెలుపొందారు. కూటమి ప్రభుత్వ మద్దతుతో సహచర కౌన్సిల్ సభ్యుల సహకారంతో ధర్మవరం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని విజయలక్ష్మి పేర్కొన్నారు.




