OD Cheruvu: ఓడీ చెరువు: విద్యుత్ స్తంభం గుంతలో పడి వృద్ధుడు మృతి
OD Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం గౌనిపల్లిలో విద్యుత్ స్తంభం కోసం తవ్విన గుంతలో పడి చాకలి నాగేష్ (64) అనే వృద్ధుడు మృతి చెందాడు.
OD Cheruvu: ఓడీ చెరువు: విద్యుత్ స్తంభం గుంతలో పడి వృద్ధుడు మృతి
శ్రీ సత్య సాయి జిల్లా: ఓ.డి చెరువు: మద్యం సేవించి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గుంతలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఓ.డి చెరువు మండలం గౌనిపల్లిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చాకలి నాగేష్ (64) వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమారు నాలుగు రోజుల క్రితం నాగేష్ స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో రాత్రి సమయంలో మద్యం సేవించిన ఆతను ఇంటికి వెళ్తుండగా, విద్యుత్ అధికారులు స్తంభం ఏర్పాటు కోసం తవ్వించిన గుంతలో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ వివాహాలు కాగా, బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాల కోసం తీసిన గుంతలను స్తంభం ఏర్పాటు చేసి వెంటనే పూడ్చివేయాల్సిన ఉండగా ఊరు
మధ్యలో ఇలా గుంతలు తీసి పూడ్చి వేయకుండా నిర్లక్ష్యం వహించడం వలన రాత్రి సమయంలో అందులో పడి వృద్ధుడు మృతి చెందాడని దీనికి కారణం విద్యుత్ అధికారులేనని గ్రామస్తులు మండిపడ్డారు.
ఘటనపై సంబంధిత పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.




