Kadiri: రోడ్డు ప్రమాదములో హిజ్రా మృతి, కేసు నమోదు

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 5 Jun 2026 8:17 PM IST
Kadiri
X

Kadiri: రోడ్డు ప్రమాదములో హిజ్రా మృతి, కేసు నమోదు

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్, వాణి స్ట్రీట్, సాయిబాబా గుడి వద్ద నివాసము ఉంటున్న షేక్ షమీర్ బాషా ( హిజ్రా) అను ఆమె తన తోటి హిజ్రాలు అయిన సానియా, భానులతో కలిసి కదిరి టౌన్ నుండి ఆటోలో మొలకవేములకు వెళుతూ ఉండగా, కుటాగుల్ల గ్రామము, RTO ఆఫీసు వద్ద సుమారు 08:50 గంటల సమయములో వారికి ఎదురుగా అనంతపురము వైపు నుండి కదిరి వైపు వెలుతున్న ఒక బోలెరో వాహనము MH10 DT 7553 దాని డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి సదరు ఆటోకు కుడివైపున ఢీ కొట్టగా,

ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ షమీర్ బాషా ( హిజ్రా) వయస్సు 44 సంవత్సరాలు, అను ఆమె తలకు సదరు బోలెరో తాకి తన తల నుజ్జు నుజ్జు అయ్యి అక్కిడికి అక్కడే చనిపోవడం జరిగింది. అయితే సదరు బోలెరో డ్రైవర్ సంఘటన వద్ద నుండి తన బోలెరోలో పారిపోవడం జరిగింది. ఈ ప్రమాదములో మిగిలిన ఎవరికి గాయాలు కాలేదు. ఆటోలో షేక్ షమీర్ బాషాతో ప్రయాణిస్తున్న తోటి హిజ్రా అయిన బంగారు సుజి @ సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story