Sri Sathya Sai: లాటరీలో ఎంపీపీ పదవి టీడీపీకి.. వైస్ ఎంపీపీ పదవి వైసీపీకి!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండల పరిషత్ ఎన్నికల్లో ఇరు పార్టీలకు చెరో 7 ఎంపీటీసీల బలం ఉండటంతో నిర్వహించిన లాటరీలో ఎంపీపీ పదవి టీడీపీకి, వైస్ ఎంపీపీ పదవి వైసీపీకి దక్కాయి.

S.Firoz, Sri Sathya Sai
Published on: 19 Nov 2026 2:58 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: లాటరీలో ఎంపీపీ పదవి టీడీపీకి.. వైస్ ఎంపీపీ పదవి వైసీపీకి!

శ్రీ సత్యసాయి జిల్లా: ఓబులదేవరచెరువు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికల్లో నెలకొన్న ఉత్కంఠకు లాటరీ ప్రక్రియతో తెరపడింది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమానంగా ఏడుగురు ఎంపీటీసీల బలం ఉండటంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియలో టీడీపీ అభ్యర్థి పిట్టా ఓబుల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఓబులదేవరచెరువు మండల పరిషత్ అధ్యక్ష పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా వైస్ ఎంపీపీ పదవికి కూడా లాటరీ నిర్వహించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటపల్లి హరిత విజయం సాధించి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో చివరకు లాటరీ ద్వారా ఎంపీపీ పదవి టీడీపీకి, వైస్ ఎంపీపీ పదవి వైసీపీకి దక్కడంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ, మండల అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai