Puttaparthi: జూదానికి బానిసై గుళ్లలో చోరీలు.. చివరకు కటకటాల్లోకి!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పరిధిలో దేవాలయ చోరీలకు పాల్పడుతున్న వడ్డే మర్రిస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 12 May 2026 9:52 PM IST
Puttaparthi
X

Puttaparthi: జూదానికి బానిసై గుళ్లలో చోరీలు.. చివరకు కటకటాల్లోకి!

Puttaparthi: శ్రీ సత్య సాయి జిల్లాలో దేవాలయలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు పోల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి బంగారు వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. రామగిరి పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్.ఎం. అలీ తో కలిసి ఎస్పీ, కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎస్పీ సి.ఎస్. సతీష్ కుమార్, ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు, రామగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండల పరిధిలో జరిగిన వరుస దేవాలయ చోరీల కేసులను ఛేదించి నేరస్థుడిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడు వడ్డే మర్రిస్వామి అలియాస్ సంకేత (45), అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు మద్యం వ్యసనం, జూదపు అలవాట్లు, ఆర్థిక అప్పుల కారణంగా దేవాలయ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.

నిందితుడు భక్తుడి వేషంలో దేవాలయాలకు వెళ్లి, జనసంచారం తక్కువగా ఉండే ఆలయాలను గుర్తించి, రాత్రి సమయంలో ఇనుప రాడ్ల సహాయంతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడు. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాలు, హుండీ నగదును లక్ష్యంగా చేసుకొని అపహరించేవాడు. దొంగిలించిన వెండి వస్తువులను కరిగించి వెండి బిస్కెట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నించేవాడని పోలీసులు వెల్లడించారు.

కర్ణాటక, అనంతపురం జిల్లాలలో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన కేసులలో నిందితుడుగా ఉన్నారని, సాంకేతిక ఆధారాలు, రాత్రి పహారా, వాహన తనిఖీలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఎస్‌ఐ టి. ప్రదీప్ రాజ్, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు దేవాలయ చోరీల కేసులతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించాయి. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం సొత్తు సుమారు 27.5, గ్రాముల బంగారు ఆభరణాలు, 380 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి బిస్కెట్

చోరీలకు వినియోగించిన ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జూదాలకు బానిసలై ఆర్థికంగా దెబ్బతిని చోరీలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారని , ఇటువంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. ఎక్కడైనా పేకాట ఆడుతుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,

ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆధారాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అవుతాయని వాటి ద్వారా నిందితులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. దేవాలయ కమిటీ సభ్యులకు ముఖ్య సూచనలు చేశారు. ఆలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బలమైన తాళాలు వినియోగించడం, రాత్రి వేళల్లో లో గుడి వద్ద కాపలాగా ఉంటూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరపై ఉందన్నారు. ముఖ్యంగా గుడికి వచ్చిన కానుకలు డబ్బులు బ్యాంకులో ఉంచే విధంగా చూడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు 100 / 112 ద్వారా సమాచారం అందించాలని సూచించారు.

కేసును విజయవంతంగా ఛేదించిన రామగిరి సర్కిల్ సిఐ ఎస్ ఎం అలీ, ఎస్సైలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story