Puttaparthi: పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన శక్తి టీం బృందాలు

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో పోక్సో (POCSO) చట్టంపై విస్తృత అవగాహన.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 29 May 2026 3:35 PM IST
Puttaparthi
X

Puttaparthi: పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన శక్తి టీం బృందాలు

పుట్టపర్తి: శక్తి టీమ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, మహిళా, బాలల భద్రతపై శక్తి టీం బృందాలు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాల లోపు బాలబాలికలపై జరిగే నేరాలను చట్టం అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తుందని, బాధితుల వయస్సు ఎంత తక్కువగా ఉంటే శిక్షలు అంత కఠినంగా ఉంటాయని ప్రజలకు వివరించారు.

ప్రత్యేకంగా 16 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికల తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచించారు. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేయకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని, రోజూ వారితో మాట్లాడాలని, సెల్‌ఫోన్ వినియోగాన్ని గమనించాలని సూచించారు. ప్రేమ వ్యవహారాలు, ఇంటి నుంచి వెళ్లిపోవడం, బాల్య వివాహాలు వంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన, సామాజిక పరిణామాలను వివరించడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలకు సూచనలు అందించారు. పరిచయం లేని వ్యక్తులను లేదా పొరుగువారిని నమ్మకూడదని, చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయరాదని తెలిపారు.

అదేవిధంగా శక్తి యాప్ వినియోగం, అత్యవసర సేవలైన 112 & 181 హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ శాఖ అందించే సహాయంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు, యువత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story