Talupula: తలుపుల సర్పంచ్ ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ నేతల పోరు!
Talupula: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ తరఫున చింతకుంట కృష్ణారెడ్డి (డీకే బాబు), టీడీపీ తరఫున ఉబ్బర రఘునాథ్ రెడ్డి తలపడనున్నారు.
Talupula: తలుపుల సర్పంచ్ ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ నేతల పోరు!
తలుపుల: తలుపుల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైయస్సార్సీపి తరఫున చింతకుంట కృష్ణారెడ్డి (డీకే బాబు) కృష్ణారెడ్డి గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసీ లక్షల రూపాయల సొంత నిధులతో వీధి దీపాలు, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉబ్బర రఘునాథ్ రెడ్డి బరిలో ఉండగా, రఘునాథ్ రెడ్డి ప్రభుత్వ టీచరుగా సేవలందించి పదవి విరమణ అనంతరం గ్రామ సేవకు సిద్ధమయ్యారు. తమ అనుభవంతో తలుపుల మేజర్ పంచాయతీని అభివృద్ధి చేస్తామని చెబుతూ ఇద్దరు అభ్యర్థులు ఓటర్ల మద్దతు కోరుతున్నారు.




