Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్.. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం!

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ భాగంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ మరియు రోడ్డు భద్రత లక్ష్యంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 30 April 2026 6:30 AM IST
Sri Sathya Sai District
X

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్.. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం!

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ భాగంగా విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని సబ్-డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ పరిధుల్లో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

ప్రధాన రహదారులు, జంక్షన్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా రాత్రి వేళల్లో పహారా బలపరిచి, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. నేరాల నియంత్రణ, చోరీలు, చైన్ స్నాచింగ్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నివారణ లక్ష్యంగా ఈ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story