Puttaparthi: విజయవాడలో YSRTA ధర్నాను జయప్రదం చేయండి.. జిల్లా నేతలు

Puttaparthi: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మే 6న విజయవాడలో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని YSRTA శ్రీ సత్యసాయి జిల్లా శాఖ పిలుపునిచ్చింది.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 4 May 2026 9:18 PM IST
Puttaparthi
X

Puttaparthi: విజయవాడలో YSRTA ధర్నాను జయప్రదం చేయండి.. జిల్లా నేతలు

Puttaparthi: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైంది అనేక కేబినెట్ సమావేశాలు జరిపింది కానీ ఉద్యగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 30% IR ఇస్తామని ఇచ్చిన హామీ,మంచి ఫిట్మెంట్తో PRC అని ఇచ్చిన హామీనే కాక పెండింగ్ బకాయిలను మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో YSRTA మొదటగా జిల్లా కలెక్టర్లకు హామీల అమలు చేయాలని వినతి పత్రం ఇచ్చి.

రెండవ దశలో మే 6 వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రవ్యాప్త YSRTA బృందం మరియు ఉపాధ్యాయులతో కలసి ధర్నా చేపట్టడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి YSRTA రాష్ట్ర జిల్లా మండల నాయకులు సభ్యులు మరియు ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలయునని YSRTA సత్యసాయి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పి వి రమణారెడ్డి మరియు లీలా ఇంద్ర ప్రసాద్ లు కోరారు . ఈ క్రింది డిమాండ్ల సాధనకై మే 6 న తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు ప్రభుత్వం పై బత్తిడి తీసుకు రావడానికి చేస్తున్న ఈ ధర్నా లో అందరూ పాల్గొనాలని కోరడమైనది.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL

Next Story