Kadiri: కదిరి 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట ప్రచారం!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల వేళ 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేశారు.
Kadiri: కదిరి 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట ప్రచారం!
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 13, 14వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారి భర్త మొగల్ ఫారూఖ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కూటమి చైర్మన్ అభ్యర్థి సోదరి షేక్ అర్షియా భాను గారిని, కూటమి తరఫున పోటీ చేస్తున్న 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను తమ అమూల్యమైన ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో అరవ గుడిసెల ప్రాంతం వరద ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో వారికి అండగా నిలిచి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, స్థానిక ఎమ్మెల్యేగా తాను ప్రజలకు అండగా నిలిచానని కందికుంట వెంకటప్రసాద్ గుర్తుచేశారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ, కదిరి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులను గెలిపించి కదిరి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
రానున్న నవంబర్ 1వ తేదీ ఎన్నికల్లో కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారితో పాటు 44 వార్డుల కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి, కదిరి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రజలను కోరారు.




