Puttaparthi: ఆర్టీసీ బస్సు ఎక్కిన సత్యసాయి జిల్లా జేసీ మౌర్య భరద్వాజ్
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ వినూత్న నిర్ణయం. ఇంధన పొదుపు కోసం ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుడిలా కలెక్టరేట్‌కు రాక.
Puttaparthi: ఆర్టీసీ బస్సు ఎక్కిన సత్యసాయి జిల్లా జేసీ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 'నో వెహికల్ డే' (No Vehicle Day) ను పాటిస్తూ, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలనే సందేశంతో ఆయన సోమవారం తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారు.
బస్సులో ప్రయాణించి కలెక్టరేట్‌కు చేరుకున్న జాయింట్ కలెక్టర్, నేరుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) హాల్‌కు చేరుకుని అర్జీలను స్వీకరించారు. కాలుష్య నివారణకు, ఇంధన వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా వారంలో ఒకరోజు సొంత వాహనాలకు దూరంగా ఉండి, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఉన్నతాధికారి స్వయంగా బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.




