Vemareddypalli: ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ!

Vemareddypalli: ఓబుళదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లిలో శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, అన్నసంతర్పణ.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 21 Aug 2026 11:53 AM IST
Vemareddypalli
X

Vemareddypalli: ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ!

Vemareddypalli: మండలంలోని వేమారెడ్డిపల్లిలో శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శుక్ర, శని, ఆదివారాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోపూజ, గణపూజ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. శనివారం ధ్వజ ప్రతిష్ఠతో పాటు దేవతామూర్తుల ఊరేగింపు చేపట్టనున్నారు. ఆదివారం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహాల ప్రతిష్ఠ, గోపుర కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

మూడు రోజులపాటు భక్తులకు అన్నసంతర్పణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు పొందడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story