Anantapur: అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా!
Anantapur: అనంతపురం జిల్లా వడెంపేట సమీపంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Anantapur: అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా!
Anantapur: వడెంపేట సమీపంలోని పామురాయ చెరువు వద్ద శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న NL 02 B 5222 నంబర్ బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారని తెలిపారు. బస్సు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




