Guntakal: వీధి కుక్కల భయంతో వణికుతున్న గుంతకల్లు వాసులు!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. ఎస్‌జేపీ హైస్కూల్ పరిసరాల్లో విద్యార్థులు, ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 Jun 2026 10:16 AM IST
Guntakal
X

Guntakal: వీధి కుక్కల భయంతో వణికుతున్న గుంతకల్లు వాసులు!

అనంతపురం జిల్లా: గుంతకల్లు పట్టణం, భాగ్యనగర్‌లోని ఎస్‌జేపీ హైస్కూల్ పరిసరాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ప్రాణభయంతో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురిపై కుక్కలు దాడి చేసి కరిచిన ఘటనలు జరిగినా, సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు మార్గదర్శకాలు ఇచ్చినా, గుంతకల్లు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

పెద్ద ప్రమాదం జరిగాక స్పందించడం కాకుండా, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి వీధి కుక్కలను నియంత్రించి విద్యార్థులు, ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని, గుంతకల్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story