Anantapur: కుటుంబ కలహాలతో వీధి వ్యాపారి బాబావాలిపై కత్తితో దాడి!

Anantapur: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని కేవీఎస్ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా బాబావాలి అనే వీధి వ్యాపారిపై బంధువులు కత్తితో దాడి చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 18 July 2026 11:09 PM IST
Anantapur
X

Anantapur: కుటుంబ కలహాలతో వీధి వ్యాపారి బాబావాలిపై కత్తితో దాడి!

అనంతపూర్: కుటుంబ కలహాలతో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలో బాబావాలి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బుక్కరాయసముద్రంలోని కె వి ఎస్ కాలనీలో బాబావాలి వీధి వీధి తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. సమీప బంధువులతో మాట మాట పెరిగి ఒకరికొకరు గొడవపడ్డారు.

ఈ గొడవలో మరో వ్యక్తి కత్తితో బాబావల్లి గొంతు వద్ద దాడి చేశాడు. అక్కడి నుంచి తీవ్ర గాయాలతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం బంధువులు తీసుకొచ్చారు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story