Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల పహారా: పటిష్ట భద్రతతో బక్రీద్ వేడుకలు!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు. దర్గాలు, మసీదుల వద్ద నిఘా పెంచిన పోలీసులు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 28 May 2026 1:32 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల పహారా: పటిష్ట భద్రతతో బక్రీద్ వేడుకలు!

Sri Sathya Sai: బక్రీదు పండుగ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా విధుల్లో పాల్గొన్నారు. స్పెషల్ పార్టీ బృందాలతో కలిసి పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో బక్రీదు పండుగను జరుపుకోవాలని సూచించారు. సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story