Sri Sathya Sai District: అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీ విజ్ఞాన్ పాఠశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో సన్మానం జరిగింది.

S.Firoz, Sri Sathya Sai
Published on: 21 April 2026 10:22 AM IST
Sri Sathya Sai District
X

 Sri Sathya Sai District

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ.డి చెరువు మండల కేంద్రంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ సీబీఎస్ఈ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన శ్రీనిధి, ద్వితీయ స్థానం పొందిన కిరణ్ కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా డబురువారి పల్లి పోస్టుమాస్టర్ ఎద్దుల కరుణాకర్ రెడ్డి, ఎస్సై మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ ర్యాంక్ సాధించిన శ్రీనిధికి రూ.10,000, ద్వితీయ ర్యాంక్ సాధించిన కిరణ్ కుమార్‌కు రూ.5,000 బహుమతిగా ఇచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్య భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు.

పాఠశాల కరస్పాండెంట్ మస్తాన్, ఉపాధ్యాయ సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. విద్యార్థుల అభివృద్ధికి పాఠశాల చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. నగదు బహుమతులు అందజేసిన కరుణాకర్ రెడ్డిని కూడా ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story