Kadiri: వేమారెడ్డి సర్కిల్ డివైడర్లపై మొక్కలు నాటిన ఎమ్మెల్యే!
Kadiri: "స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కందికుంట మొక్కలు నాటారు.
Kadiri: వేమారెడ్డి సర్కిల్ డివైడర్లపై మొక్కలు నాటిన ఎమ్మెల్యే!
Kadiri: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ కూడలి డివైడర్లపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు మరియు పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కదిరి పట్టణాన్ని మరింత అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా రహదారి డివైడర్లు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




