Tadipatri: తాడిపత్రిలో బాల్య వివాహాల నిరోధక రోజు, డ్రైడే ఫ్రైడే
Tadipatri: తాడిపత్రి 29వ వార్డు సచివాలయంలో బాల్య వివాహాల నిరోధక రోజు; చట్టపరమైన వయస్సు, ఆరోగ్య సమస్యలపై కౌన్సిలర్ జక్కా సుధా అవగాహన, రెడ్డివారిపాలెంలో డ్రైడే ఫ్రైడే.
Tadipatri: తాడిపత్రిలో బాల్య వివాహాల నిరోధక రోజు, డ్రైడే ఫ్రైడే
తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని 29వ వార్డు గ్రామ స్వర్ణ సచివాలయంలో వార్డు కౌన్సిలర్ జక్కా సుధా బాల్యవివాహాల గురించి ప్రస్తావిస్తూ బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ వాటిని నిర్మూలించాలని తమ వంతు కృషి చేస్తామని ప్రసంగించారు.
బాల్య వివాహాల వల్ల చిన్నారుల భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా, వారి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా బాలికలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని
భారతదేశ చట్టాల ప్రకారం బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరగాలని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి, సంబంధిత సచివాలయంలోని మహిళా కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేసి వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, ఎక్కడైనా జరుగుతున్నా వాటిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. “చిన్నారుల చేతుల్లో పుస్తకాలు ఉండాలి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 29వ వార్డు రెడ్డివారిపాలెంలో సచివాలయం సిబ్బందితో కలిసి డ్రైడే ఫ్రైడే కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.




