Tadipatri: జిల్లా ఎస్పీని కలిసి మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

Tadipatri: హైకోర్టు ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉల్లంఘిస్తున్నారంటూ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన తాడిపత్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 27 July 2026 5:27 PM IST
Tadipatri
X

Tadipatri: జిల్లా ఎస్పీని కలిసి మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

తాడిపత్రి: ప్రజలందరి తరఫున, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వల్ల ఎంతమంది బాధపడ్డారో అందరికీ తెలుసు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రస్తుత టౌన్ ప్రెసిడెంట్ వర్క్‌షాప్‌లు, షోరూమ్‌లపై పడి మొత్తం ధ్వంసం చేశారు.

మేము ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లం, ప్రజాప్రతినిధులం. ఎలాంటి భేదం లేకుండా ఆడవాళ్లని, మగవాళ్లని చూడకుండా భౌతికంగా దాడులు చేశారు, అక్రమ కేసులు బనాయించారు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం, ఇప్పుడు గుర్తొస్తుందా పెద్దారెడ్డి నీకు కూటమి ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో తన ఇంటికి రానివ్వడం లేదని, మీటింగ్‌లు పెట్టుకోనివ్వడం లేదని పెద్దారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కోర్టు వాదోపవాదాలు విన్నాక కొన్ని స్పష్టమైన నిబంధనలతో ఉత్తర్వులు జారీచేసింది ఇంటికి వెళ్లాలంటే 24 గంటల ముందే పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి.

మీటింగ్ కండక్ట్ చేయాలంటే.. ఎంతమంది పాల్గొంటారు పేర్లు ఏంటి ఎన్ని వాహనాలు ఉంటాయి అనే వివరాలతో పర్మిషన్ తీసుకోవాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు పెట్టిన ఏ ఒక్క నిబంధననూ పాటించడం లేదు. ఇది ప్రజాస్వామ్యమా మేము వారిని రాకుండా అడ్డుకుంటున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇప్పటికీ ఒకటే మాటపై కట్టుబడి ఉన్నాం.

తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ 24 మంది తప్ప వైసీపీ కి చెందిన ఏ చిన్న కార్యకర్త అయినా, వేరే ఏ నాయకుడైనా వచ్చి నిరాటంకంగా మీటింగ్‌లు పెట్టుకోవచ్చు. ఆ 24 మంది వస్తే మళ్లీ శాంతిభద్రతల సమస్య వస్తుందనేది మాత్రమే మా ఆందోళన. వైసీపీ లో ఒక్క పెద్దారెడ్డి మాత్రమే ఉన్నారా? వేరే నాయకులు లేరా? వాళ్లు వచ్చి మీటింగ్‌లు జరుపుకోవచ్చు కదా!

మేము ఎప్పుడూ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. వాళ్లు పెట్టిన అక్రమ కేసుల చుట్టూ తిరుగుతున్నామే తప్ప, ఇప్పటివరకు వాళ్లపై ఎలాంటి భౌతిక దాడులు చేయలేదు, అక్రమ కేసులు బనాయించలేదు. వాళ్లు హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి నామీద, మా ఆడవాళ్ల మీద దాడులు చేసినా మేము చట్టాన్ని గౌరవించాం.

హైకోర్టు ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారే బేఖాతరు చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పటికే గౌరవ ఎస్పీ ని, కలెక్టర్ని, ఐజీ, డీఐజీ లకు వినతిపత్రాలు సమర్పించాం. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story