Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి బహిరంగ సవాల్

Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 5 Sept 2026 5:13 PM IST
Tadipatri
X

Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి బహిరంగ సవాల్

తాడిపత్రి: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా, ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా, పోలీసులపై ఒత్తిడి తీసుకురావద్దని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు.జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి.. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్నారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులేనని.. కానీ ఆయన చేసినవన్నీ తప్పులేనంటూ కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.యల్లనూరు మండలంలో జేసీ వర్గం రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతోందని కేతిరెడ్డి ఆరోపించారు.

జేసీ వర్గీయుల దాడులపై పోలీసులు ఫిర్యాదులు ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు.బాధితుల తరఫున కాకుండా నిందితులకు పోలీసులు వత్తాసు పలకడం సరైన విధానమా అని నిలదీశారు.ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు.తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అలజడి సృష్టించేందుకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని కేతిరెడ్డి ఆరోపించారు.బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.

తాడిపత్రి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి..పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story