Tadipatri: మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్‌కు నీటి విడుదల.. రైతుల హర్షం!

Tadipatri: సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఎదుర్కొంటున్న పెద్ద వడుగూరు మండల రైతులకు ఊరటనిస్తూ ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్‌కు నీటిని విడుదల చేయించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Nov 2026 5:21 PM IST
Tadipatri
X

Tadipatri: మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్‌కు నీటి విడుదల.. రైతుల హర్షం!

తాడిపత్రి: సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెద్ద వడుగూరు మండల రైతులకు ఊరట కల్పించేలా, మండలానికి జీవనాధారమైన మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి .నీటిని విడుదల చేయించారు.

రైతుల సాగు, పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పెద్ద వడుగూరు మండలానికి కొంతైనా నీటిని అందించాలనే సంకల్పంతో కలెక్టర్ గారితో HLC ఉన్నత అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల చేయించిన తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి .

కష్టకాలంలో రైతులకు అండగా నిలుస్తూ, వారి సాగు అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటి విడుదల చేయించడంతో పెద్ద వడుగూరు మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ MLA జెసి అష్మిత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్