Kadiri: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది!

Kadiri: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన కదిరి ఎమ్మెల్యే.

P.RAHAMTULLA, KADIRI
Published on: 3 Oct 2026 8:31 AM IST
Kadiri
X

Kadiri: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది!

Kadiri: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అని సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ నిబద్ధత అని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వైసీపీ నేతలు న్యాయస్థానంలో సవాలు చేయడం వల్ల బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఆటంకం ఏర్పడిందని విమర్శించారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడం ద్వారా వైసీపీ నేతలు బీసీ వర్గాల ఆశలపై నీళ్లు చల్లారని వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయ అవకాశాలు పెరగడం ఇష్టం లేకనే న్యాయపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎదురైన న్యాయపరమైన పరిణామాల అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. అప్పట్లో రిజర్వేషన్లు తగ్గడం వల్ల సుమారు 16,800 మంది బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో పదవుల అవకాశాలను కోల్పోయారని పేర్కొన్నారు.

“బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, న్యాయపరంగా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదు” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతకు సంబంధించిన అంశమని అన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం కాకుండా, పాలనలో భాగస్వాములను చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ విధానమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ పరిశీలకులు చెంచయ్య నాయుడు,కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,టీడీపి నాయకులు ఖాసీం వలి, పిచ్చిలి శంకర పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI