Anantapur: కళ్యాణదుర్గంలో టీడీపీ-జనసేన కూటమి ఇంటింటి ప్రచారం!
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ-జనసేన కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సైకిల్, గాజు గ్లాసు గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Anantapur: కళ్యాణదుర్గంలో టీడీపీ-జనసేన కూటమి ఇంటింటి ప్రచారం!
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ–జనసేన కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని 9వ వార్డు వెస్ట్ పరిధిలోని మారంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు.
టీడీపీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుట్న లక్ష్మీదేవి తిమ్మరాజు, జనసేన తరఫున 9వ వార్డు వెస్ట్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమృతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రచారంలో కూటమి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్న లక్ష్మీదేవి తిమ్మరాజుకు *సైకిల్ గుర్తుపై, జనసేన కౌన్సిలర్ అభ్యర్థి అమృతకు **గాజు గ్లాసు గుర్తుపై* ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన అభ్యర్థి అమృత, పార్లమెంట్ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు గంగరాజు భార్య.
ఈ ప్రచార కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బోయ లక్ష్మీదేవి, పట్టణ కన్వీనర్ డిష్ మురళి, బుజ్జి, జనసేన రాజేష్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




