Dharmavaram: ధర్మవరం 41వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 41వ వార్డులో టీడీపీ ఇంచార్జ్ గోసల శ్రీరాములు ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేత.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 1 Oct 2026 12:47 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం 41వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 41 వ వార్డు లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇంచార్జ్ గోసల శ్రీరాములు సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించారు.

శ్రీరాములు మాట్లాడుతూ ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు తెల్లవారుజాము నుండి పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందిస్తున్నట్లు తెలిపాడు.ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాగేంద్ర గౌడ్, దామోదర్ నాయుడు, దుర్గ ప్రసాద్, శ్రీధర్ బాబు ఈశ్వరయ్య, మహేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM