Kadiri: కదిరిలో కోట్ల విలువైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కోట్ల విలువైన భూమిని టీడీపీ నేత సుదర్శన్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 12 May 2026 6:18 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో కోట్ల విలువైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్!

Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి రూరల్ మండలం పట్నం పంచాయతీ పరిధి లోని నడింపల్లి కి చెందిన శివారెడ్డి, రవీందర్ రెడ్డిలకు చెందిన భూమి సర్వే నెంబర్ 1052 పైకి 2.60, సెంట్లు.1052-A పైకి 46.5 సెంట్లు తమ ప్రమేయం లేకుండా టిడిపి నేత సుదర్శన్ రెడ్డి మా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వాపోయిన బాధితులు.

వివరాల్లోకెళ్తే మేము మా తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం ముగ్గురు కొడుకులు ఇద్దరు ఆడబిడ్డలు, మాకు ఉన్న ఉమ్మడి భూమిని మా అన్నను మా చెల్లెలు వేరే వారు లోబర్చుకొని భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులకి ఆ భూమి పైకి హక్కు ఉన్న తెలియజేయకుండా మోసం చేశారని విలేకరులకు తెలిపారు.

ఈ భూమి కదిరి మండలం పట్నం పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే నడింపల్లి వద్ద జాతీయ రహదారికి అనుకోని ఉన్నది ఈ భూమి కోట్ల రూపాయల విలువ చేస్తుందని బాధిత రైతులు వాపోయారు.

ప్రభుత్వ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు పరచి మాకు న్యాయం చేయాలని శివారెడ్డి, రవీందర్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story