Anantapur: అనంతపురంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

Anantapur: అనంతపురంలో ఘనంగా నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 May 2026 4:12 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

అనంతపూర్: అన్నగారు స్థాపించిన 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలతోనే ఈనాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.

జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించే దిశగా ఈనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలన సాగుతోంది. ఈ భూమిపై తెలుగువాడు ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.

అభివృద్ధి - సంక్షేమం: ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ, నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు మరియు అభిమానులు పాల్గొని అన్నగారికి జయంతి నివాళులు అర్పించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story