Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల సందడి!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. ఆర్డీవో కార్యాలయంలో టీడీపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్ పత్రాలు సమర్పించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 17 Oct 2026 3:45 PM IST
Kadiri
X

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల సందడి!

Kadiri: కదిరి పట్టణంలోని RDO కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్దకు అభ్యర్థులు చేరుకుని ఒకేసారి నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటో దిగారు.

ఈ సందర్భంగా పలు వార్డులకు చెందిన అభ్యర్థులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ భేరీ మోగించి కదిరి మున్సిపాలిటీ సాదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులు మన్సూర్, Exide జిలాన్, రంగారెడ్డి, రాజేందర్, లాటరీ శ్రీనివాసులు, డైమండ్ ఇర్ఫాన్,తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI