Rayadurgam: మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల టీడీపీ బీమా పత్రాల అందజేత!
Rayadurgam: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త లడ్డు ఇస్మాయిల్ కుటుంబానికి రూ.5 లక్షల పార్టీ ప్రమాద బీమా పత్రాలను కాలవ భరత్ అందజేశారు.
Rayadurgam: మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల టీడీపీ బీమా పత్రాల అందజేత!
రాయదుర్గం: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లడ్డు ఇస్మాయిల్ కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా కింద మంజూరైన రూ.5 లక్షల బీమా పత్రాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు గారి తనయుడు కాలవ భరత్ అందజేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వo రూ.100 చెల్లించి పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకి పార్టీ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ బీమా ద్వారా లడ్డు ఇస్మాయిల్ మరణానంతరం రూ.5 లక్షల బీమా మొత్తం నామినీ ఖాతాలో జమ కావడం పార్టీ సభ్యత్వం ద్వారా లభించే భరోసాకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి అగ్రహారం కిరణ్ కుమార్,కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ ఛైర్మన్ పూజరి శివ, క్లస్టర్ ఇంఛార్జి ఇనాయత్, జామీల్ ఖాన్, సనావుళ్ల, ఘోర ఖలందర్,జీలాన్ ఖలందర్, ఆటో వెంకటేశులు, జావిద్ తదితరులు పాల్గొన్నారు.




